Andhra Pradesh: ఇకపై ఏపీలో ఆ నాటకంపై నిషేధం.. ఎక్కడా ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ..

|

Jan 17, 2022 | 10:19 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో  చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. వైశ్యులను కించపరించే విధంగా ఉన్న ఈ నాటక

Andhra Pradesh: ఇకపై ఏపీలో ఆ నాటకంపై నిషేధం.. ఎక్కడా ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ..
Follow us on

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో  చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. వైశ్యులను కించపరించే విధంగా ఉన్న ఈ నాటక ప్రదర్శనలను నిషేధించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి చేసింది.   దీనిపై  ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.   ఈ మేరకు  రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటక ప్రదర్శనలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ఆదేశాల ప్రకారం ఇకపై  రాష్ట్రంలో ఎక్కడైనా ఈ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే  కఠిన చర్యలు తప్పవు.

కాగా తెలుగు నాటక రంగంలో చింతామణికి  ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది.  కాగా ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం తదితర కీలక  పాత్రలు ఉన్నాయి . అయితే నాటకంలోని సుబ్బిశెట్టి  పాత్ర చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటాడు.  ఈ క్రమంలోనే ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్యులు  ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇకపై ఎక్కడా చింతామణి నాటకం ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.

Also read: చలికాలంలో తీపి తినాలనిపిస్తుందా.. ఇంట్లోనే రుచికరమైన బెల్లం అన్నం తయారు చేయండి..

Budget 2022: ద్విచక్ర వాహనాలు విలాసవంతమైనవి కావు.. అందుకే వాటిపై జీఎస్టీ తగ్గించండి: ఎఫ్‌ఏడీఏ

బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. మూడేళ్ల ఎఫ్డీలపై పన్ను మినహాయింపు అవకాశం..!