AP New Districts: ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌సిగ్నల్.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వo

|

Jan 26, 2022 | 9:07 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందుకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది.

AP New Districts: ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌సిగ్నల్.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వo
Ap New Districts Names Announced Live Updates Video
Follow us on

Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ(Sameer Sharma)కు అందించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government). తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాల(New Districts)ను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్(Notification) జారీ చేసింది.

26 జిల్లాలకు సంబంధించి రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల స్థానంలో ఇక నుంచి 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లను ప్రతిపాదించింది. కొత్త జిల్లాలుగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల
పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ పేర్లను సూచించింది. ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్వీకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని స్పష్టం చేశారు.

పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా

అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా

కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా

ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా

బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా

నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా

నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా

పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా

రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా

తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా

కాగా, ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిపాలనా సౌలభ్యం, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని సీఎం వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు. 2021 జనాభా గణన ముందుకు రావడంతో పునర్వ్యవస్థీకరణ కొంత ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. అర‌కు పార్లమెంట్‌ భౌగోళికంగా చూస్తే విస్తార‌మైనది. అరకును రెండు జిల్లాలుగా చేసే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసింది. అంశాల వారిగా వివిధ శాఖల అధికారులతో నాలుగు సబ్‌ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటుచేసింది. పలుమార్లు సమావేశమైన కమిటీ సభ్యులు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దు నిర్ధారణకు ప్రాతిపదిక ఏంటి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి విధానం అనుసరించాలి? వంటి అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. దీంతో ప్రభుత్వం 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది.

కొత్త జిల్లాలు ఇవే All Gazettes

Read Also….. Buddhadeb Bhattacharjee: పద్మభూషణ్‌ను స్వీకరణకు మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ నిరాకరణ.. ఎందుకో తెలుసా?