Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

|

May 17, 2023 | 5:45 PM

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు ట్రాన్స్‌ఫర్ అవ్వనున్నారు.

Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Andhra CM Jagan
Follow us on

ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న బ్యాన్‌ను తాత్కాలికంగా ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  రిక్వెస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో .. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉండనుంది. గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని రిక్వెస్ట్‌పై బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా  బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2023 ఏప్రిల్ 30 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీలకు అర్హులుగా పేర్కొంది.  టీచర్లతో పాటు పలు ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకూ బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నులు,  రవాణా, వ్యవసాయ శాఖల్లో పని చేసే ఉద్యోగుల బదిలీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ 1 నుండి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ బ్యాన్ వర్తించనుందని ప్రభుత్వం పేర్కొంది. ఎంప్లాయిస్ బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసిన అనంతరం ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెడతామని గవర్నమెంట్ వివరించింది. ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్సు విచారణ పెండింగ్‌లో ఉన్న వారి అంశాలను తెలియచేయాలని ఆయా శాఖలకు ఆర్దిక శాఖ ఆదేశించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..