Amaravathi: అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని(AP Capital) అమరావతి ప్రాంతంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పరిధిలోని గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు ప్రజంట్ 5 రోజుల పని విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతోపాటు, కార్పోరేషన్లలో ఉద్యోగులు వారానికి ఐదు రోజులే డ్యూటీలు చేస్తున్నారు. ఈ విధానాన్నే మరో ఏడాది పొడిగించింది ప్రభుత్వం. సీఎస్ సమీర్‌శర్మ(AP chief secretary Sameer Sharma)గురువారం ఈ ఉత్తర్వులిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేయాలన్న సర్కార్.. జూన్ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఉచిత వసతి మరో 2 నెలలు పొడిగింపు…
హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని మరో 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత జులై ఫస్ట్ లోపు ఫ్లాట్లను వదిలి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉన్నఫలంగా ఆదేశాలు రావడంతో అమరావతిలోని ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతి మేరకు ఉచిత వసతి సదుపాయాన్ని రెండు నెలలపాటు పొడిగించింది. కాకపోతే ఆ నివాసాలను మంచి స్థితిలోనే అప్పగించాలని.. ఆయా ఫ్లాట్లకు ఏదైనా నష్టం జరిగి ఉంటే దానికి ఉద్యోగులే బాధ్యత వహించాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి