AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పంచ సూత్రాలతో సరికొత్త ఫ్లాన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 నుంచి రైతన్నా మీ కోసం కార్యక్రమం చేపట్టనుంది. వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగును లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.

రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పంచ సూత్రాలతో సరికొత్త ఫ్లాన్..!
Ap Cm Chandrababu Raithanna Meekosam
Balaraju Goud
|

Updated on: Nov 21, 2025 | 7:24 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 నుంచి రైతన్నా మీ కోసం కార్యక్రమం చేపట్టనుంది. వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగును లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సహా 10 వేల మంది రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ‘రైతన్నా మీ కోసం’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు సీఎం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వాల మద్దతు అంశాలతో పంచ సూత్రాల విధానం ఉంటుందని సీఎం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!