Raithu Bharosa: ఆ రోజున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్ము.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

|

May 04, 2021 | 9:26 PM

YSR Raithu Bharosa: రైతు భరోసా తొలి విడత నిధులు రూ. 4,050 కోట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నట్లు..

Raithu Bharosa: ఆ రోజున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్ము.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
YS Jagan
Follow us on

YSR Raithu Bharosa: రైతు భరోసా తొలి విడత నిధులు రూ. 4,050 కోట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే తొలి విడత రైతు భరోసా కింద. మే 13న 54 లక్షల మంది రైతులు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 7500 చొప్పున ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.

అలాగే 2020 ఖరీఫ్ ఉచిత పంటల బీమాను ఈ నెల 8వ తేదీన.. మే 25న పంట నష్ట పరిహారం నగదును ఇవ్వనున్నట్లు మంత్రి పేర్ని నాని అన్నారు. ఇక మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా పధకం కింద మత్స్యకార కుటుంబానికి రూ. 10 వేలు ఆర్ధిక సాయం ఇస్తామన్నారు.

ఏపీ కేబినెట్‌ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇవే..!

  • మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ. వేటకెళ్లే మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సాయం.
  • మే 25న వైఎస్సార్ ఉచిత పంటల బీమా నగదు జమ.
  • కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయం.
  • కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1,448 కోట్లు మంజూరుకు పచ్చజెండా .
  • కైలాసగిరి- భోగాపురం మధ్య ఆరు లైన్ల రోడ్డు వేయడంతో పాటు ఐదెకరాల్లో స్కైటవర్స్ నిర్మాణం‌, 11 బీచ్‌ల అభివృద్ధికి ఆమోద ముద్ర.
  • పల్నాడు కరవు నివారణకు రూ.2,740 కోట్లు రుణం తీసుకొనేందుకు ఆమోదం.
  • ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
  • తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు ఏర్పాట్లు
  • రూ.511.79 కోట్లతో 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!