
కాణిపాకం ఆలయ ఈవో సురేష్‌బాబుపై సీరియస్ యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. ఇష్టానుసారంగా వ్యవహరించినందుకు ఆలయ బాధ్యతల నుంచి తప్పించింది. దేవాదాయశాఖకి తెలియకుండా అభిషేకం టికెట్ ధరలను పెంచేందుకు ప్రయత్నించంతో బదిలీ వేటేసింది ప్రభుత్వం. ఆలయ పాలకమండలితో సంబంధం లేకుండా స్వామివారి అభిషేక టికెట్‌పై సొంత నిర్ణయం తీసుకున్నారు సురేష్‌బాబు. అభిషేక సేవా టికెట్ ధరను 750 నుంచి ఏకంగా 5వేల రూపాయలకు పెంచేందుకు ప్రయత్నించారు. ప్రతిపాదన చేయడమే కాదు, ఏకంగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేసి ఆలయ పాలకమండలికి షాకిచ్చారు సురేష్‌బాబు. దీంతో ఈవో వ్యవహారశైలిపై భక్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
అభిషేక సేవా టికెట్ ధరను ఒకేసారి 750 నుంచి 5వేలకు ఎలా పెంచుతారంటూ క్వశ్చన్స్ రెయిజ్ అయ్యాయి. ఈవో సురేష్‌బాబు వ్యవహారశైలిపై పాలకమండలి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పాలకమండలికే తెలియకుండా ఎలా రేట్లు పెంచుతారంటూ ప్రశ్నించింది. ఇష్యూ కాస్తా, దేవాదాయశాఖ దృష్టికి రావడంతో సురేష్‌బాబు వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణించింది ప్రభుత్వం. ఈవో సురేష్‌బాబుపై సీరియస్ యాక్షన్‌కు ఆదేశించింది.
ప్రభుత్వం ఆదేశాలతో ఈవో బాధ్యతల నుంచి సురేష్‌బాబును తప్పించిన దేవాదాయశాఖ, అతను విడుదలచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఏకపక్షంగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది. ఇక, సురేష్‌బాబు స్థానంలో రాణా ప్రతాప్‌ను కాణిపాకం ఆలయ కొత్త ఈవోగా నియమించింది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..