AP 10th exams: ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు.. రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఇలానే ఉంటే..

|

May 15, 2021 | 4:14 PM

జూన్‌ 7 నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి  పబ్లిక్‌  ప‌రీక్ష‌ల‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన....

AP 10th exams: ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు.. రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఇలానే ఉంటే..
AP Education Minister adimulapu suresh on 10th exams
Follow us on

జూన్‌ 7 నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి  పబ్లిక్‌  ప‌రీక్ష‌ల‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. సెల‌వుల్లో విద్యార్థులు ఇంటిప‌ట్టునే ఉంటారు కాబ‌ట్టి ప‌రీక్ష‌ల‌కు బాగా ప్రీపేర్ అవ్వాల‌ని కోరారు. జూన్‌ 1 నుంచి టీచర్లు బడికి రావాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీఎం ప్రత్యేకంగా రివ్యూ చేసి తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటోందని.. అయినప్ప‌టికీ నిర్దేశించిన స‌మయం వ‌చ్చిన‌ప్పుడు మ‌రోసారి రివ్యూ చేస్తామ‌ని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా హైకోర్టు సూచనలతో జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెప్తామని ప్రకటించింది.

Also Read: అంతేగా… మేమూ తయారు చేస్తాం… ఆ స్థాయి లాబొరేటరీలు AP,తెలంగాణల్లోనూ ఉన్నాయంటున్న బయోటెక్నాలజీ నిపుణులు

వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ ఐటమ్స్ తినొద్దు..! అయినా తిన్నారంటే కొవ్వును కొనితెచ్చుకున్నట్లే..?