AP EDCET: మట్టిలో మాణిక్యం ఈ అమ్మాయి.. ఎడ్ సెట్ లో ఆదోని అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

| Edited By: Surya Kala

Jul 15, 2023 | 7:48 AM

ఏ పి ఎడ్ సెట్ ఫలితాలలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. శనివారం విడుదలైన ఫలితాలలో ఎడ్ సెట్ లో బయోలాజికల్ సైన్స్ విభాగంలో పట్టణంలోని ఫారీద్ సాహెబ్ వీధికి చెందిన అమ్మాయి ఆస్మా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

AP EDCET: మట్టిలో మాణిక్యం ఈ అమ్మాయి.. ఎడ్ సెట్ లో ఆదోని అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
Ed Cet First Ranker
Follow us on

ప్రతిభకు చదువుకు ఆర్ధిక పరిస్థితికి అడ్డం కాదు అని నిరూపించింది ఒక యువతి..వెనుకబడిన రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లా ఆదోని అమ్మాయి రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. అది కూడా ఒక నిరుపేద కారు డ్రైవర్ కూతురు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎడ్ సెట్ లో ఆదోని అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

ఏ పి ఎడ్ సెట్ ఫలితాలలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. శనివారం విడుదలైన ఫలితాలలో ఎడ్ సెట్ లో బయోలాజికల్ సైన్స్ విభాగంలో పట్టణంలోని ఫారీద్ సాహెబ్ వీధికి చెందిన అమ్మాయి ఆస్మా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అందులో 98 మార్కులు వచ్చాయి. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ( బి జెడ్ సి) పూర్తి చేసింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి రఫీక్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తాను ఉపాధ్యాయురాలుగా స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.