AP EAPCET 2023 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2023 హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం (మే 9) విడుదలయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగ జనార్దన్‌, కన్వీనర్‌ శోభాబిందు..

AP EAPCET 2023 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2023 హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి
AP EAPCET 2023 Hall Tickets

Updated on: May 09, 2023 | 8:40 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం (మే 9) విడుదలయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగ జనార్దన్‌, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఏపీఈఏపీసెట్‌-2023 వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 2023 – ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో ఇంజినీరింగ్‌ విభాగానికి 2,37,055, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు 99,388 దరఖాస్తు చేసుకున్నారు. రెండు విభాగాలకు కలిపి 979 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరుగనున్నాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌, పరీక్ష కేంద్రాలు, ఇతర ఏదైనా సందేహాలకు విద్యార్ధులు 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చని కన్వీనర్‌ శోభాబిందు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.