AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల.. క్లిక్ చేయండిలా..

|

Sep 08, 2021 | 11:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష 'ఏపీఈఏపీసెట్'(ఓల్డ్ ఎంసెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు..

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల.. క్లిక్ చేయండిలా..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష ‘ఏపీఈఏపీసెట్'(ఓల్డ్ ఎంసెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,66,460 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా.. 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారు. అటు 14వ తేదీన అగ్రికల్చర్, ఫార్మా పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి అన్నారు.

ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా.. అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్ధులకు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో పరీక్షలు జరిగాయి. కంప్యూటర్‌ విధానం ద్వారా కరోనా నిబంధనలు అనుసరిస్తూ ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఇక ఈ నెల 18వ తేదీ నుంచి మొదటి కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు తమ ఫలితాలు చూసుకునేందుకు https://sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని మంత్రి అన్నారు. అలాగే కరోనా సోకి పరీక్షలకు హాజరు కాలేని విద్యార్ధులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్ధులు రేపటి నుంచి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. అనంతపురానికి చెందిన నిఖిల్‌కు మొదటి ర్యాంక్ వచ్చినట్లుగా చెప్పారు.

Also Read:

 పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!