నైరుతి రుతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులు(Thunderstoms) పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరమండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాం ప్రాంతాల్లో, విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ప్రాంతాల్లో, అనకాపల్లి జిల్లాలోని చీడికాడ, కే.కొత్తపాడు, దేవరపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట, బలిజిపేట, పాలకొండ, సీతంపేట మండలాల్లోని పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరించారు.
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు కాపరులు చెట్ల క్రింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండవద్దని అధికారులు సూచించారు. వెంటనే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరారు.
మరిన్ని వాతావారణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..