Kurnool: మద్యానికి డబ్బులు ఇవ్వలేదనీ.. తల్లిని వేట కొడవలితో నరికిన కొడుకు
మద్యానికి బానిసైన కుమారుడు నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని చంపేందుకు తెగబడ్డాడు. మద్యం సేవించడానికి అడిగినంత డబ్బులు ఇవ్వడంలేదని తల్లిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. మద్యం మైకంలో వేట కొడవలితో నరికి చంపాలని ప్రయత్నించాడు. దీంతో ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ప్రాణాల కోసం పారిపోతున్న తల్లిని చంపేందుకు కత్తి పట్టి వెంటాడాడు. పారిపోతున్న తల్లి వెంటపడి దొరకబట్టి.. వేట కొడవలితో అతిదారుణంగా నరికేందుకు..

డోన్, అక్టోబర్ 15: మద్యానికి బానిసైన కుమారుడు నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని చంపేందుకు తెగబడ్డాడు. మద్యం సేవించడానికి అడిగినంత డబ్బులు ఇవ్వడంలేదని తల్లిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. మద్యం మైకంలో వేట కొడవలితో నరికి చంపాలని ప్రయత్నించాడు. దీంతో ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ప్రాణాల కోసం పారిపోతున్న తల్లిని చంపేందుకు కత్తి పట్టి వెంటాడాడు. పారిపోతున్న తల్లి వెంటపడి దొరకబట్టి.. వేట కొడవలితో అతిదారుణంగా నరికేందుకు యత్నించాడు. దీంతో ఆ తల్లి చేయి అడ్డుపెట్టీ ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి కరునించని తాగుబోతు కొడుకు వేటకొడవలితో చెయ్యి, కాలుపై తెగనరికాడు. రక్త గాయాలు కావడంతో ఆ తల్లి అక్కడే కుప్ప కూలింది. కుమారుని దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం రక్త గాయాలతో పారిపోలేని పరిస్థితిలో రక్షించండి అంటూ.. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమికూడారు. దీంతో అక్కడి నుంచి ఆ కసాయి కొడుకు పారిపోయాడు. ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లాలోని డోన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నూల్ జిల్లాలోని డోన్‌కు చెందిన మద్దమ్మకు సురేష్ అనే కొడుకున్నాడు. ఎదిగిన కొడుకు తనను ఆదుకుంటాడని కలలు కన్న మద్దమ్మకు నిరాశే ఎదురైంది. మద్యానికి బానిసైన నరేష్ డబ్బు కోసం నిత్యం తల్లిని హింసించేవాడు. ఈ క్రమంలో తాజాగా తల్లిపై వేటకొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర రక్త గాయాలతో పడి ఉన్న మద్దమ్మను స్థానికులు హుటాహుటిన డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు వైద్య చికిత్స అందించి వేట కొడవలితో నరికిన ప్రాంతంలో కుట్లు వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో స్థానికులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నిందితుడు సురేష్‌పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి పట్ల కర్కశంగా ప్రవర్తించి అతి దారుణంగా చంపాలని ప్రయత్నించిన సురేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు.
డోన్ పట్టణంలో మద్దమ్మపై కుమారుడి దాడి చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మద్దమ్మను వద్దకు వెళ్లి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాగుడుకు బానిసైన కుమారుని మద్యం మానివేయలని తరచూ చెబుతున్నానని, దీనితో అతడు తల్లితో గొడవ పడేవాడని పోలీసులకు తల్లి మద్దమ్మ తెలిపింది. ఈ క్రమంలోనే తనపై దాడి చేసినట్లు మద్దమ్మ పోలీసులకు తెల్పింది. మద్దమ్మ వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న సురేష్‌ను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డోన్ పోలీసులు తెలిపారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.