ఈ చిన్ని మసాలా మొగ్గతో ఆ సమస్యలన్నీ పరార్..!

Jyothi Gadda

24 April 2025

లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంటే.. ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ గుణాలు. అలాగే విటమిన్ C కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలో విష వ్యర్థాలను తొలగిస్తాయి.

లవంగాలు తీసుకుంటే పంటి నొప్పిని తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. అదే విధంగా లవంగం నూనె నొప్పిని తగ్గిస్తుంది. దీనిని నమలడం వల్ల దంతాల ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది. 

ఇది దంతలు, చిగుళ్ళ వాపుని తగ్గిస్తుంది. ఇది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తుంది. క్యాన్సర్, గుండె సమస్యలు, లివర్ సమస్యలు వీటి వల్ల వస్తాయి.

లవంగాలు ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ఈ సమస్యల్ని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియాస్‌ని దెబ్బతీసి మధుమేహానికి దారితీస్తాయి. వీటిని తగ్గించడానికి లవంగాలు చాలా మంచివి.

ఇందులో విటమిన్ కె, పొటాషియంలు ఉంటాయి. ఇందులో యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఘాటుగా ఉంటుంది. లవంగాల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. 

లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీపీని తగ్గిస్తాయి. రక్తనాళాలు బాగా పనిచేసేలా చేస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇది లివర్ హెల్త్‌కి చాలా మంచిది. ఫ్యాటీ లివర్ సమస్యని తగ్గిస్తుంది. మధుమేహానికి కూడా మంచి మందు అని చెప్పొచ్చు. బ్లాక్ కరంట్‌లోని యూజినాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేస్తుంది. 

మధుమేహాన్ని నియంత్రించడంలో సాయపడుతుంది. లవంగాలు మంచివి. అలా అని ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి మంచిది కాదు. అలర్జీలకి కారణమవుతుంది.