AP Crime News: కానిస్టేబుల్‌పై యువకుడి వీరంగం.. నేనెవరో తెలుసా అంటూ దాడి

Andhra Pradesh News: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బస్ స్టాండ్ ఆవరణలో బైక్‌పై వెళ్తున్న తనను ఆపినందుకు.. పోలీసులపై రెచ్చిపోయాడు.

AP Crime News: కానిస్టేబుల్‌పై యువకుడి వీరంగం.. నేనెవరో తెలుసా అంటూ దాడి
Biker Attacks Police

Updated on: Oct 08, 2021 | 10:56 AM

Andra Pradesh Crime News: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బస్ స్టాండ్ ఆవరణలో బైక్‌పై వెళ్తున్న తనను ఆపినందుకు.. పోలీసులపై రెచ్చిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ కలర్ పట్టుకుని దాడి చేశాడు. పక్కనే ఉన్న పోలీసులు వద్దని వారించినా లెక్క చేయకుండా కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు కురిపించాడు. తాను ఎవరో తెలుసా? అంటూ రెచ్చి పోయిన ఆ యువకుడు.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. యూనిఫాంలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఆకతాయి దాడిని పోలీసులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడి దాడి..

Also Read..

Anantapuram: అనంతపురం జిల్లాలో చిరుత పులుల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు..

మాదాపూర్‌లోని CII జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు బీభత్సం.. వీడియో