Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో చిన్నచిన్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తుండటంతో ఆందోళన మొదైలంది. ఇటీవల 100 నుంచి 120 మధ్యలో నమోదవుతున్న కేసులు కాస్త.. గత 24గంటల్లో భారీగా పెరిగాయి. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8,91,178 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 7179 కి చేరింది.
కాగా.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,82,841 మంది వైరస్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,158 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 47,803 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితోకలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,03,941 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. చాలా రోజుల తర్వాత ఏపీలో మళ్లీ కేసులు పెరగడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
కాగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించింది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో అక్కడ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read: