ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 91,231 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3620 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,85,716కి చేరింది. ఇందులో 40,074 యాక్టివ్ కేసులు ఉండగా.. 18,32,971 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 41 మంది ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 12,671కు చేరుకుంది.
ఇక గడిచిన 24 గంటల్లో 5757 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,18,95,922 సాంపిల్స్‌ను పరీక్షించారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 190, చిత్తూరు 451, తూర్పుగోదావరి 617, గుంటూరు 299, కడప 137, కృష్ణా 332, కర్నూలు 44, నెల్లూరు 210, ప్రకాశం 386, శ్రీకాకుళం 118, విశాఖపట్నం 176, విజయనగరం 95, పశ్చిమ గోదావరి 565 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read:
బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!
రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!
మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!
డివిలియర్స్‌లాగే సుడిగాలి ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సూపర్ ఫాస్ట్ సెంచరీ కొట్టేశాడు.!