ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. క్రితం రోజుతో పోలిస్తే, కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 91,677 శాంపిళ్లను పరీక్షించగా.. 2,665 పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,19,948కి చేరింది. మంగళవారం కొత్తగా 3,231 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1878266కి పెరిగింది.
కోవిడ్ కారణంగా కొత్తగా తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూర్‌లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలలో ఒక్కొ క్క రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13002కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 28680 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,29,86,288 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 91, చిత్తూరు 358, తూర్పుగోదావరి 665, గుంటూరు 277, కడప 79, కృష్ణ 252, కర్నూలు 51, నెల్లూరు 251, ప్రకాశం 310, శ్రీకాకుళం 116, విశాఖపట్నం 171, విజయనగరం 61, పశ్చిమ గోదావరి 360 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 106, చిత్తూరు 353, తూర్పుగోదావరి 529, గుంటూరు 223, కడప 161, కృష్ణ 281, కర్నూలు 33, నెల్లూరు 195, ప్రకాశం 285, శ్రీకాకుళం 56, విశాఖపట్నం 112, విజయనగరం 38, పశ్చిమ గోదావరి 293 కేసులు నమోదయ్యాయి.