AP Corona Bulletin: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..!

|

Jan 15, 2022 | 5:07 PM

AP Corona Bulletin: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల..

AP Corona Bulletin: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..!
Ap Corona Cases
Follow us on

AP Corona Bulletin: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,955 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అంటే ఇన్నటి కంటే 400లకుపైగా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కరోనాతో కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. కోవిడ్‌ నుంచి కొత్తగా 397 మంది కోలుకున్నారు.

ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించేలా చర్యలు చేపడుతోంది. మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:

Coronavirus: కనికరించని కరోనా మహమ్మారి.. దేశంలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. తాజాగా ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

Telangana: తెలంగాణలో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు బంద్.! రేపు అధికారిక ప్రకటన..!