ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం టూర్‌లో భాగంగా కళ్యాణదుర్గంలో వైఎస్‌ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం. 2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10.2లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 2022 ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు సీఎం జగన్ ఖరీఫ్-2022 బీమా పరిహారం పంపిణీ చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ్నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు. రేపు పులివెందులలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ సహా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల10న కొప్పర్తి పారిశ్రామికవాడలో ఆల్‌డిక్సన్ యూనిట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు.
వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా వెఎస్ తనయుడు ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా అంటూ ట్వీట్ చేశారు జగన్. ఈ తపనే.. ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసిందన్నారు. మీ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందన్నారు జగన్. వైఎస్ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజుగా అభివర్ణిస్తూ ట్విట్ చేశారు జగన్.
అటు, వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల, విజయలక్ష్మి ఇప్పటికే ఇడుపులపాయలోనే ఉన్నారు. ఇడుపులపాయలోనే ఉన్న వైఎస్ షర్మిల, విజయలక్ష్మి వైఎస్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు సీఎం జగన్. అనంతపురంలో రైతు భరోసా నిధులు విడుదల చేసి – నేరుగా ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు. అనంతరం మూడు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. అంతకన్నా ముందే వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్