Amaravati: అమరావతిలో రేపే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ.. భారీ ఏర్పాట్లు.. తుళ్లూరులో హైటెన్షన్..
గత ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా చెప్పుకున్న అమరావతిలో మరో కీలక ఘట్టానికి కౌంట్‌డౌన్ స్టార్టయింది. ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇదే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా.. మే26న (శుక్రవారం) ఈ ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నారు పేదలు.

గత ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా చెప్పుకున్న అమరావతిలో మరో కీలక ఘట్టానికి కౌంట్‌డౌన్ స్టార్టయింది. ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇదే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా.. మే26న (శుక్రవారం) ఈ ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నారు పేదలు. సీఎం హోదాలో అమరావతిలో జగన్‌కి ఇదే మొట్టమొదటి బహిరంగసభ కానుంది. దీంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటపాలెంలోని సీడ్ ఆక్సిస్ రోడ్ పక్కనే పబ్లిక్ మీటింగ్ వేదికను ఏర్పాటుచేశారు. లబ్దిదారుల కుటుంబాలతో పాటు వాళ్ల బంధువులు కూడా సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. 51 వేల 392 మంది కోసం మొత్తం 25 లేఔట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 50 వేల మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. పట్టాల పంపిణీ పూర్తికాగానే.. ఇళ్ల నిర్మాణం జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసింది సీఆర్‌డీఏ.
R5 జోన్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సుధీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్‌తో ఏపీ సర్కార్ ముందుకెళ్తుంటే.. తుది తీర్పు రాకముందే తొందరేంటి అంటూ నిరసనకు దిగారు అమరావతి రైతులు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య క్లాస్ వార్ అని జగన్ చెప్పడంతో.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది వ్యవహారం. పట్టాల పంపిణీ కార్యక్రమానికి అడ్డుపడతారన్న ముందస్తు అంచనాతో పోలీసులు ముందస్తు అరెస్టులు, నిషేధాజ్ఞలకు దిగారు. దీంతో.. తుళ్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.
వైసీపీ ప్రభుత్వం.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్- 5జోన్‌గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 1134 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, నవులూరు, బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ఈ లేఅవుట్లను సిద్ధం చేసింది. మొత్తం 51 వేల 392 మంది లబ్దిదారులకు సీఎం జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం..