CM Jagan: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ సెటైర్లు.. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత- సీఎం జగన్‌

|

Oct 12, 2023 | 1:48 PM

చంద్రబాబు తొలిసారిగా నెల రోజులు రాష్ట్రంలోనే ఉన్నారన్నారు సీఎం జగన్‌. అది కూడా రాజమండ్రి జైలులోనే అన్నారు.  చంద్రబాబుకు రాష్ట్రంపైనే కాదు.. కుప్పంపైనా ప్రేమ లేదన్నారు సీఎం జగన్. కనీసం ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు జగన్. యూజ్‌ అండ్‌ త్రో అనేది పవన్‌ విధానమన్నారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నా ఇళ్ల నిర్మాణాల్లో వెనక్కి తగ్గలేదన్నారు. చంద్రబాబుకు అధికారం పోయేసరికి వీళ్లందరికి ఫ్యూజులు పోతాయని..

CM Jagan: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ సెటైర్లు.. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత- సీఎం జగన్‌
Cm Jagan
Follow us on

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ..31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అంటూ చెప్పారు సీఎం జగన్. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లుగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పుడే ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లుగా తెలిపారు సీఎం జగన్.

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాట్లుగా చెప్పారు సీఎం జగన్. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని..ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్‌, సిమెంట్‌ అందిస్తున్నామన్నారు.వేల కోట్లు ఖర్చు చేసి సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు సీఎం జగన్.

చంద్రబాబు తొలిసారిగా నెల రోజులు రాష్ట్రంలోనే ఉన్నారన్నారు సీఎం జగన్‌. అది కూడా రాజమండ్రి జైలులోనే అన్నారు.  చంద్రబాబుకు రాష్ట్రంపైనే కాదు.. కుప్పంపైనా ప్రేమ లేదన్నారు సీఎం జగన్. కనీసం ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నా ఇళ్ల నిర్మాణాల్లో వెనక్కి తగ్గలేదన్నారు. చంద్రబాబుకు అధికారం పోయేసరికి వీళ్లందరికి ఫ్యూజులు పోతాయని.. ఎందుకు కంటే వారి ఆదాయం పోతుందన్నారు.

సీఎం జగన్‌ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయని సీఎం జగన్ అన్నారు. జగన్‌ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది.. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం