YS Jagan on Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వారిలో కొందరు షర్మిల వెంట వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో కాకినాడలో ఫించన్ పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ తన సోదరి షర్మల కాంగ్రెస్ చేరికను ఉద్దేశిస్తూ పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు.
చాలారోజుల క్రితమే అన్న జగన్‌తో విభేదించి… తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. కొన్నాళ్లు అక్కడే రాజకీయాలు నడిపారు వైఎస్ షర్మిల. ఇప్పుడు సడెన్‌గా కాంగ్రెస్ కండువాతో ఏపీవైపు దూసుకొస్తున్నారు షర్మిల. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. గతంలో అన్న వదిలిన బాణంగా ఇదే కాంగ్రెస్‌పై కయ్యానికి కాలుదువ్విన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీని వేదికగా చేసుకుని అన్నపైకి దూసుకొస్తున్నారా? అనే ముచ్చట రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు వైఎస్ షర్మిల. ఈనేపథ్యంలోనే డిసెంబర్ 4న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెఢీ అయ్యారు. కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అనంతరం ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. షర్మిలతోపాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఆయనతో పాటు వైసీపీ అసంతృప్త నేతలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వారిలో కొందరు షర్మిల వెంట వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో కాకినాడలో ఫించన్ పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ తన సోదరి షర్మల కాంగ్రెస్ చేరికను ఉద్దేశిస్తూ పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ఏపీలో కుట్రలు, కుతంత్రాలు జరగుతాయన్నారు జగన్. అంతేకాదు.. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చీ రాజకీయాలకు వాడుకోబోతున్నారంటూ మండిపడ్డారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు.. కుటుంబాలను చీల్చుతారు.. అబద్దాలు చెబుతారు.. మోసాలు చేస్తారు.. ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ జగన్ పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదు.
ఇంతటి హీటుపుట్టించే రాజకీయాల వేళ.. ఆసక్తికర సన్నివేశం కూడా ఆవిష్కృతం కాబోతోందిప్పుడు. త్వరలోనే జరగనున్న తన కుమారుడి పెళ్లికి సంబంధించి ఆహ్వానపత్రికతో .. అన్నయ్య జగన్ దగ్గరికి వెళ్లబోతున్నారు షర్మిల. చాలా రోజుల తర్వాత అన్నాచెల్లెలు కలువనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోదరీసోదరుల మధ్య రాజకీయాలు చర్చకు వస్తాయా? కుటుంబవ్యవహారాల వరకే పరిమితమవుతారా? అనే చర్చ జరుగుతోంది.
దీంతో ఏపీలో రాజకీయంగా ఆసక్తికర అంశమైంది. ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…