Delhi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ సమావేశం.. చర్చించిన అంశాలివే..

|

Feb 09, 2024 | 1:43 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌. ముందుగా పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గంటన్నర పాటు మోదీ - జగన్‌‎ల మీటింగ్‌ సాగింది. ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. పెండింగ్‌ బిల్లులు, విభజన హామీలతోపాటు.. తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Delhi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ సమావేశం.. చర్చించిన అంశాలివే..
Ap Cm Ys Jagan
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌. ముందుగా పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గంటన్నర పాటు మోదీ – జగన్‌‎ల మీటింగ్‌ సాగింది. ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. పెండింగ్‌ బిల్లులు, విభజన హామీలతోపాటు.. తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఏపీ అంశాల్ని ప్రస్తావిస్తూనే వచ్చారు సీఎం జగన్. ప్రధానికి కొన్ని వినతిపత్రాలు కూడా ఇస్తూ వచ్చారు. ఐతే.. ఈసారి మీటింగ్‌ చాలా సుదీర్ఘంగా జరగడం బట్టి చూస్తే.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇవాళ 11 గంటల 10 నిమిషాలకు సీఎం జగన్‌ ప్రధాని ఛాంబర్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌ కూడా అక్కడే ఉన్నారు. జగన్‌ వెళ్లిన కాసేపటికి మురళీధరన్‌ బయటకు వచ్చేశారు. హోమంత్రి అమిత్‌షా కూడా ఆ సమయంలో ప్రధాని ఛాంబర్‌లోనే ఉన్నారు. ప్రధాని మోదీ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ కానున్నారు. ఏపీకి రావల్సిన నిథులపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ నుంచి బాబు తిరిగి వచ్చిన తరువాత జగన్ ఇవాళ ప్రధానితో భేటీ కావడంతో తాజా రాజకీయాల పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..