స్కూళ్లలో ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎవరికైన లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తాజాగా క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆరోగ్యశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని అన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రతీ స్కూల్‌లో టెస్టింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు.
మరోవైపు థర్డ్ వేవ్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. వ్యాక్సినేషన్‌లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా మరో గంట పాటు కర్ఫ్యూ సడలింపును ప్రకటించారు.
ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అనుమతులు ఇవ్వనుండగా.. ఆ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఇక పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందన్న సీఎం.. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తప్పనిసరి అని అన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.45 శాతం ఉందని వైద్యశాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని.. మిగతా మూడు జిల్లాల్లో 3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. థర్డ్ వేవ్‌కు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మొత్తం వాక్సినేషన్ తీసుకున్నవారు – 1,82,00,284
సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు – 1,15,98,720
రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు – 66,01,563
ఉపయోగించిన మొత్తం వ్యాక్సిన్ డోసులు – 2,48,01,847
న్యూమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్ కాంజ్యుగట్ వ్యాక్సిన్‌ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు
ఇప్పటివరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్న ప్రభుత్వం
కొత్తగా ఇస్తున్న న్యూమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
వ్యాక్సినేషన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వినియోగించుకోవాలన్న సీఎం
విలేజీ, వార్డు క్లీనిక్‌లు ఏర్పాటైన తర్వాత అక్కడ నుంచి పిల్లలకు సమర్థవంతంగా వ్యాక్సినేషన్ అందించాలని సీఎం ఆదేశం
నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలన్న సీఎం
పీహెచ్‌సీలు మొదలుకుని సీహెచ్‌సీలు బోధనాసుపత్రుల వరకు రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలన్న సీఎం
90 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం
ఆ తర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదన్న సీఎం
ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టంచేసిన సీఎం
ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశం