దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి నిధులు వెచ్చిస్తుందన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. కాగా, రెండో విడత సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు 693 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు బాగా చదువుకోవాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమన్న ఆయన.. పిల్లలకు చదువు తప్ప మనం ఏం ఇవ్వగలమని అన్నారు.
విద్య కోసం పిల్లల పేరెంట్స్ అప్పుల పాలు కాకుడదన్న సీఎం.. వారి భవిష్యత్ మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. చదువు సరిగ్గా చెప్పకపోతే.. కాలేజీ యాజమాన్యాలను నిలదీస్తారనే ఉద్దేశంతోనే తల్లుల ఖాతాలో జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రెండో విడత నగదు గురువారం విడుదల చేశారు.
దేశ సగటుతో పోలిస్తే.. ఏపీలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గిస్తుందన్నారు ఏపీ సీఎం. దేశంలో 24 శాతం మంది నిరక్షరాస్యులు ఉంటే.. ఏపీలో 33 శాతం మంది ఉన్నారు. అక్షరాస్యతలో బ్రిక్స్ దేశాల్లో మనమే వెనుకబడి ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయని సీఎం గుర్తు చేశారు. టెన్త్ తర్వాత.. 73 శాతం మంది పై చదువులకు వెళ్లలేకపోవడం ఆందోళన కల్గిస్తుందన్నారు.
ఇప్పటికే మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 19న సీఎం వైఎస్ జగన్ 671 కోట్ల రూపాయలను జమ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలు రూ. 1,774 కోట్లతో సహా గురువారం వేయబోయే విద్యా దీవెనతో మొత్తం రూ. 5573 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది.
ఇప్పటివరకూ విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం 25,714 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇక మూడో విడత విద్యాదీవెన ఈ డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..
TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..