AP Job Calendar: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఆయా శాఖల వారిగా ఉన్న ఖాళీల నివేదికను జగన్ ప్రభుత్వం రెడీ చేసింది. అలాగే పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.
ఈ పోస్టులను ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రేపు (జూన్ 18న) సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను అవసరాల మేరకు భర్తీ చేయాలని యోచిస్తోంది సర్కార్. ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రాధాన్యత ప్రకారం దశలవారిగా ఆర్థిక శాఖ ఆమోదంతో విడుతల వారీగా ఆయా ఖాళీలకు పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అలాగే నూతన విద్యా విధానం గురించి సీఎం జగన్.. రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.