AP News: ఆంధ్రా కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

|

Dec 03, 2024 | 6:59 PM

ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగపర్చేందుకు ఉద్దేశించిన పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటం, టెక్స్ట్‌ టైల్‌, సమీకృత పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీలకు ఆమోదం తెలపడంతో పాటు గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై చర్చించింది.

AP News: ఆంధ్రా కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Andhra Cabinert Meeting
Follow us on

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కొనసాగింది ఏపీ మంత్రివర్గం. కాకినాడ పోర్ట్‌, గౌతమ్ ఆదానీ వ్యవహారంపై భేటీలో కీలకంగా చర్చించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదించిన నిర్మాణ పనులను 11,467కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29, కోవర్కింగ్ సీర్స్‌కు స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 10వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా 2లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా గార్మెంట్స్‌ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు కేటగిరీలుగా విభజించి వారికి రాయితీలు కల్పిస్తామన్నారు మంత్రి పార్థసారథి. ఏపీ మారిటైమ్ పాలసీ 4.Oని ఆమోదించింది. 975 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుని పోర్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందించామన్నారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డీపీఆర్‌ స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు ప్రాజెక్ట్‌ను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలో ప్రచారం జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ గుర్తుచేసినట్టు సమాచారం. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.

కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు….

  • ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్
  • ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ పాలసీకి ఆమోద ముద్ర
  • ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ పాలసీ 4.0కు మంత్రి వర్గం ఆమోదం
  • పులివెందుల, ఉద్దానం, డోన్‌ తాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
  • ఏపీ మారిటైమ్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం
  • పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు నిర్ణయం
  •  పీఎం ఆవాస్‌ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
  • సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..