Andhra Pradesh: పవన్‌తో పొత్తుపై సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్.. వారే మేం విడిపోవాలని కోరుకుంటున్నారంటూ..

|

Mar 22, 2023 | 7:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ మధ్య దూరం పెరిగిపోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల బీజేపీ నాయకుల కామెంట్లు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో

Andhra Pradesh: పవన్‌తో పొత్తుపై సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్.. వారే మేం విడిపోవాలని కోరుకుంటున్నారంటూ..
Somu Veerraju, Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ మధ్య దూరం పెరిగిపోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల బీజేపీ నాయకుల కామెంట్లు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమకు సహకరించలేదంటూ బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయని చెప్పిన ఆయన.. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోందనీ తెలిపారు. దీంతో బీజేపీ- జనసేన పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనసేన సహకరించడం లేదనే మాధవ్‌ కామెంట్స్‌పై స్పందించడానికి నిరాకరించిన ఆయన జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జనసేనతో విడిపోతామని నేను చెప్పను. మేం విడిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి కోరిక ఫలించకపోవచ్చు. జనసేన సహకరించడం లేదనే మాధవ్‌ కామెంట్స్‌పై నేను స్పందించను. బీజేపీ-వైసీపీ ఒకటే అనేది అపోహ మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేకత ఏపీలో ఉంది. ఏపీలో బీజేపీని అన్‌పాపులర్‌ చేయాలని చూస్తున్నారు. ఏపీలో బలపడేందుకు క్షేత్ర స్థాయిలో పోరాటాలకు ప్లాన్ చేస్తాం’ అని వ్యాఖ్యానించారు సోము వీర్రాజు.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపపై సమీక్షించిన మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారాయన. అంతేకాదు.. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోందన్న ప్రచారాన్ని కూడా ఖండించారాయన.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..