Purandeswari: చట్ట సభలో దిగజారుడు భాష బాధాకరం.. ఏపీ అసెంబ్లీ తీరుపై పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

|

Nov 21, 2021 | 11:16 AM

రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టింది. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది.

Purandeswari: చట్ట సభలో దిగజారుడు భాష బాధాకరం.. ఏపీ అసెంబ్లీ తీరుపై పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు
Daggubati Purandeswari Copy
Follow us on

 Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతుల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ప్రత్యక్ష ఆందోళనల్లో దిగుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టింది. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది.

ఇందులో భాగంగా అమరావతి రైతుల మహాపాదయాత్రలో మేము సైతం అంటూ కమలం కదులుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధికారికంగా మద్దతు ప్రకటించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపింది. ఇప్పుడు పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించింది. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనబోతోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ మనసు మార్చాలంటూ అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. 45 రోజుల పాటు అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతలు కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యులు అవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వారు పాదయాత్రలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లా కావలిలో వారు పాదయాత్రతో పాల్గొంటారు. రైతులతో కలిసి నడుస్తారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీమంత్రి సుజన చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ పాదయాత్రలో పాల్గొంటారు.

ఈ క్రమంలోనే రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు ఎపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి నెల్లూరు బయలుదేరి వెళ్లారు. రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నామని సోము వీర్రాజు. ఏపీలోని అన్ని జిల్లాల్లో బీజేపీ మద్ధతు తెలుపుతుందన్నారు. రైతుల పాదయాత్రలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు. రైతు పాదయాత్ర పై ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్న వీర్రాజు.. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్న ఆయన.. రాజధాని చుట్టూ కేంద్రం అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందన్నారు మేము అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నాం, అమరావతి రైతులకు బీజేపీ తోడుగా ఉంటుంది.. ఏ ప్రభుత్వం చెప్పిన అమరావతిని అడుగు కూడా కదపలేరు.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని. చట్టానికి విరుద్ధంగా చేసే పని ఏది బీజేపీ ఊరుకోదని వీర్రాజు హెచ్చరించారు.

ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు. విభజన చట్డంలోని అంశాల్లోని అన్ని అంశాలను 90 శాతం కేంద్రం పూర్తి చేసిందని ఆమె గుర్తు చేశారు. ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఎపీకి అనేక విధాలుగా సహకరిస్తుందన్నారు. ఎపీ ఆర్ధికస్ధితి సరిగాలేకపోతే నిధులను కేంద్రం ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఎపీలో అభివృద్ది జరుగుతుంది అంటే అది కేంద్రం నిధులేనన్నారు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని గతంలోనే ప్రకటించాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నామన్నారు. రైతులపై దాడులు సరికాదన్న పురంధేశ్వరి.. రాజధాని అభివృద్ది కోసం కేంద్రం రూ.1,500 కోట్లు కేటాయించిందన్నారు.

అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకొనే పవిత్రమైన ప్రదేశం.. భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మండిపడ్డారు. సభలో భిన్నమైన వాతావరణం జరుగుతుంది. ప్రజా సమస్యలపై కాకుండా ఇతర అంశాలను ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ వాతావరణాన్ని మార్చేస్తున్నారన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ నేతలు నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు.

Bjp Leaders


Read Also…  Weekly Horoscope: ఈ వారం వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.. నవంబర్ 21 నుంచి 27వరకూ రాశిఫలాలు