AP Politics: ఏపీలో బీజేపీ పుంజుకుంటోంది.. 2024 ఎన్నికల్లో మా బలమేంటో చూపిస్తాం.. సోము వీర్రాజు ధీమా..

| Edited By: Shaik Madar Saheb

Nov 16, 2021 | 7:20 PM

ఆంధప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు..

AP Politics: ఏపీలో బీజేపీ పుంజుకుంటోంది.. 2024 ఎన్నికల్లో మా బలమేంటో చూపిస్తాం.. సోము వీర్రాజు ధీమా..
Follow us on

ఆంధప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రభుత్వం వలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అడ్డగోలు పనులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులపై ఆయన మంగళవారం టీవీ9తో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం ఇమేజ్‌ రోజు రోజుకీ పడిపోతోంది. ఎన్నికల్లో విజయం కోసం అడ్డదారులు తొక్కుతోంది. ముందు రెండు గంటలు ప్రజలు వచ్చి ఓట్లు వేస్తే.. తరువాత వారే ఓట్లు గుద్దుకుంటున్నారు. వలంటరి వ్యవస్థను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. డబ్బు విచ్చలవిడిగా పంచి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పన్నినా వారికి వచ్చిన ఓట్లు 52 శాతం మాత్రమే’ అని సోము వీర్రాజు విమర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, 2024 ఎన్నికల్లో పార్టీ బలమేంటో చూపిస్తామని బీజేపీ చీఫ్‌ ధీమా వ్యక్తం చేశారు ‘ఏపీలో బీజేపీ పుంజుకుంటోంది. ప్రతిపక్షాలు కొన్ని లొంగిపోయినా బీజేపీ మాత్రం దూకుడుతో ముందుకు వెళుతోంది. ఎన్నికలు ఎక్కడ జరిగినా ధైర్యంగా పోటీచేస్తోంది. బీజేపీ కార్యకర్తలు కరపత్రాలతో ప్రచారం చేస్తే వైసీపీ ప్రభుత్వం కరెన్సీ కట్టలతో ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. 2024 ఎన్నికల్లో బీజేపీ బలమేంటో చూపిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు.

Also Read:

AP MLC elections: ఏపీ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

TTD: ఆలయాల రోజువారీ వ్యవహారాలు న్యాయస్థానం పరిధిలోకి రావు.. స్పష్టం చేసిన సుప్రీం కోర్టు..

CBI: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో ఏపీ సహా 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు..