Rain Alert: అమ్మబాబోయ్ మరో అల్పపీడనం.. ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. తుఫాన్‌గా మారితే దుమ్ముదుమారమే..

| Edited By: Shaik Madar Saheb

Nov 09, 2024 | 10:09 PM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే గడిచిన నెల రోజుల్లో రెండు అల్పపీడనాల ప్రభావంతో నాలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు..

Rain Alert: అమ్మబాబోయ్ మరో అల్పపీడనం.. ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. తుఫాన్‌గా మారితే దుమ్ముదుమారమే..
Rain Alert
Follow us on

బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది.. ఇప్పటికే.. అక్టోబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాల ప్రభావం నాలుగు రాష్ట్రాలపై తీవ్రంగా చూపించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు ఏపీ సరిహద్దులో తీరం దాటింది. ఆ ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావమే చూపింది. తమిళనాడు ఏపీ సరిహద్దులోని సూళ్లూరుపేట సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఆ సమయంలో ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో తీవ్ర వర్షపాతం నమోదైంది. రెండు రాష్ట్రాలు సరిహద్దుల్లోని పంటలు దెబ్బ తిని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వాయుగుండం తీరం దాటిన పది రోజుల్లోనే ఏర్పడిన మరో అల్పపీడనం.. తుఫాన్ గా మారింది. అయితే తుఫాన్ ప్రభావం తమిళనాడు ఏపీపై కాకుండా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ పై తీవ్రంగా చూపడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ నెలాఖరిలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫాన్ గా మారి.. తమిళనాడు ఏపీ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ పై ప్రభావం చూపింది. ఒరిస్సా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. రానున్న నెల రోజుల్లో మరో మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది.

అయితే.. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే ఈసారి తుఫాన్ గా మారితే తమిళనాడు ఏపీ వైపే దూసుకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం తమిళనాడు శ్రీలంక మీదుగా కదులుతూ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం ఏర్పడ్డ మరో 24 గంటల తర్వాత అది ఎటువైపు కదులుతుంది అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఏపీ తీరం వైపు కదిలితే మరోసారి ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా.. ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు అంచనా. తుఫానుగా మారితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటికే వరుస అల్పపీడనాలు తుఫానులు రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు గత రెండు నెలలుగా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం నెలరోజులుగా చాలా చోట్ల కనిపించింది. తాజాగా.. ఏర్పడనున్న అల్పపీడనం తుఫానుగా మారినా ఆ వెంటనే మరో రెండు అల్పపీడనాలు ఏర్పడి వాటి ప్రభావం కూడా బలంగా ఉంటే తమిళనాడుతో పాటు ఏపీ తీరానికి ముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అయితే ఈ అల్పపీడనాలు బలపడకుండా సముద్రంలోనే బలహీనపడితే మోస్తరు వర్షాలతో పెద్దగా నష్టం ఉండేటువంటి అవకాశం లేదు. అదే తుఫానుగా మారితే మాత్రం వాటి బీభత్సానికి మరోసారి భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడులో ఇప్పటికే ఋతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం ప్రభావంతో రామేశ్వరం కన్యాకుమారి, నాగపట్నం మైలాడుదురై, జిల్లాలకు భారీ హెచ్చరికలు ఉన్నాయి. అల్పపీడనం ఏర్పడ్డ మరో 24 గంటల తర్వాత చెన్నై వైపు కదిలితే దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అల్పపీడనం బలపడి వాయుగుండం తుఫానుగా మారితే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..