Tirumala: తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత ట్రాప్‌..

Leopard Traped at Tirumala Walkway: తిరుమల నడకదారిలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలినడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనులు చిరుతపులి చిక్కింది. ఇప్పటి వరకు వరుసగా ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన ప్రాంతమైన నరసింహ స్వామి ఆలయం, 7వ మైలు మధ్యలో చిరుత బోనులో చిక్కింది. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమరాలో కనిపించింది చిరుత. దాంతో అలర్ట్ అయిన టీటీడీ అధికారులు,

Tirumala: తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత ట్రాప్‌..
Leopard

Updated on: Sep 07, 2023 | 6:44 AM

Leopard Traped at Tirumala Walkway: తిరుమల నడకదారిలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలినడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనులు చిరుతపులి చిక్కింది. ఇప్పటి వరకు వరుసగా ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన ప్రాంతమైన నరసింహ స్వామి ఆలయం, 7వ మైలు మధ్యలో చిరుత బోనులో చిక్కింది. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమరాలో కనిపించింది చిరుత. దాంతో అలర్ట్ అయిన టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది.. ఆ చిరుతను పట్టుకునేందు బోనును ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కింది. కాగా, అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా, ఇప్పుడు చిక్కిన 5వ చిరుత కూడా మగ చిరుతగానే భావిస్తున్నారు అటవీశాఖ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..