Andhra Pradesh: అనంతపురం జిల్లాలో మరో పరువు హత్య కలకలం.. యువకుడిని హత్య చేయించిన యువతి తల్లి

Anantapur Honor Killing News: అంతలోనే మురళీ దారుణ హత్యకు గురయ్యాడు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి వీణ కన్నీరుమున్నీరైంది. తన తల్లి యశోదమ్మనే చంపించిందని ఆరోపించింది.

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో మరో పరువు హత్య కలకలం.. యువకుడిని హత్య చేయించిన యువతి తల్లి
Ananthapuram Honor Killing Incident

Updated on: Jun 20, 2022 | 1:56 PM

Anantapur Honor Killing Incident: అనంతపురం జిల్లాలో వరుస పరువు హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉరవకొండలో హానర్‌ కిల్లింగ్ ఘటన మరువక ముందే.. కనగానపల్లిలో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. తన బిడ్డ తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే నెపంతో దారుణానికి పాల్పడింది యువతి తల్లి. ముగ్గురు యువకులు పక్కా ప్లాన్డ్‌గా కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత శివారు ప్రాంతానికి తీసుకెళ్లి యువకుడ్ని గొంతుకోసి హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. కనగానపల్లికి చెందిన మురళి.. అదే ప్రాంతానికి చెందిన వీణలు ప్రేమించుకున్నారు. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని జీర్ణించుకోలేని వీణ తల్లి మొదటి నుంచి బెదిరింపులకి పాల్పడింది. ఈ క్రమంలోనే డ్యూటీకి వెళ్లిన మురళీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. కంగారుపడ్డ వీణ పోలీసుల్ని ఆశ్రయించింది. అంతలోనే మురళీ దారుణ హత్యకు గురయ్యాడు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి వీణ కన్నీరుమున్నీరైంది. తన తల్లి యశోదమ్మనే చంపించిందని ఆరోపించింది.

మురళీ హత్యతో కన్నవాళ్లు కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకును దారుణంగా చంపేశారంటూ గుండెలు బాదుకున్నారు. పరువు హత్యను తీవ్రంగా ఖండించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌.. మాజీ మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

మురళి హత్యపై కురుబ సామాజిక వర్గం నేతలు ఆందోళనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. మురళి హత్యతో ప్రమేయమున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పరువుహత్యపై అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నామన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

కొద్దిరోజుల వ్యవధిలోనే అనంతపురం జిల్లాలో రెండు పరువు హత్యలు జరగడం కలకలం రేపుతోంది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..