మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై మరో కేసు నమోదు అయ్యింది. సంగం డెయిరీ వ్యవహారంలో ఆయన ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పైనా, సంగం డెయిరీ పాలకవర్గ సభ్యులపైనా విజయవాడలో కేసు నమోదైంది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మే 29న ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేయడంతో పటమట పీఎస్ లో కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా సమావేశం జరిపారంటూ పటమట పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కిశోర్ కుమార్ ఫిర్యాదు చేయడంతో, ఈ కేసు నమోదైంది. ఆ రోజు జరిగిన సమావేశానికి సంబందించి సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల, తదితరులపై ఐపీసీ 269, 270, 34, 188 సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదైంది. అయితే, తమపై కేసు నమోదు చేయడాన్ని సంగం డెయిరీ పాలకవర్గం ఖండించింది. తాము నిబంధనలకు అనుగుణంగానే సమావేశం నిర్వహించామని స్పష్టం చేసింది. దీనిపై పోలీసులు సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శిని పిలిపించి విచారణ జరిపారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. సంగం డెయిరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగియంటూ ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు .ఆయన గతంలో సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో అరెస్ట్ అయ్యారు.
Also Read : బెజవాడలో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది…