ఈ నెల 14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు!

| Edited By:

May 07, 2019 | 3:16 PM

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈనెల 14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం జరుగనుంది. మొత్తం 8 రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అన్నవరం […]

ఈ నెల 14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు!
Follow us on

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈనెల 14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం జరుగనుంది. మొత్తం 8 రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అన్నవరం బోర్డు డైరెక్టర్‌ రావిపాటి సత్యనారాయణ వెల్లడించారు.