Annamayya Project: అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిల్‌ కుమార్‌

|

Dec 04, 2021 | 5:05 PM

Annamayya Project: ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి..

Annamayya Project: అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిల్‌ కుమార్‌
Follow us on

Annamayya Project: ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంపై విపక్షాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయుడు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నామని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టుపై ఆయన మీడియా సమావేశం చూశానని, చాలా విషయాలను దాచి పెట్టారని ఆరోపించారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడమే ఆయన ఉద్దేశమని ఆరోపించారు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం 2 లక్షల 17 వేల క్యూసెక్యులు. కానీ గంటల వ్యవధిలోనే 3 లక్షల 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. స్థానికంగా భారీ వర్షం కురిసిందని, పై నుంచి వరద కూడా విపరీతంగా వచ్చిందని, అధికారులు పగలు రాత్రి లేకుండా పనిచేశారని తెలిపారు. విపత్తు వల్ల జరిగిన ఘటనను.. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని ఎలా అంటారని అనిల్‌ కుమార్‌ ప్రశ్నించారు.

ఆ సమయంలో చంద్రబాబు ఏం చేశారు..

డ్యామ్‌ సెఫ్టి విషయంలో 2017లోకొత్త స్పిల్‌వే కట్టాలంటే అప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క గేట్‌ మరమ్మతు చేయించడం కుదరలేదన్న అనిల్‌.. చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడలేదని , అప్పుడు గేట్‌కు మరమ్మతులు చేయించి ఉంటే బాగుండేదని అన్నారు. అప్పుడు నీళ్లు కూడా లేవని, కానీ వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక వర్షాలు కురిశాయని, అందువల్ల గేట్ల మరమ్మతులు చేయడం కుదరలేదన్నారు.

చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..

చంద్రబాబు నాయుడు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబువి దొంగ ఏడుపులు, చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. అలాగే కేంద్ర మంత్రి షేకావత్‌ మాటలు చాలా బాధ కలిగించాయని అన్నారు. గంటల వ్యవధిలోనే లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని, ప్రభుత్వం తరపున చేపట్టాల్సి చర్యలు చేపట్టామన్నారు. 140 ఏళ్లుగా చూడని విపత్తు ఇది అని అన్నారు.