AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annadata Sukhibhava: ఏపీ రైతులకు ప్రభుత్వం పండుగ గిఫ్ట్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.6 వేలు.. విడుదలకు లైన్ క్లియర్..!

ఏపీలోని రైతులకు శుభవార్త. త్వరలో అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కసరత్తులు చేస్తోంది. వరుస పండుగల కారణంగా ఏ సమయంలోనైనా జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఒకేసారి రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ కానున్నాయి.

Annadata Sukhibhava: ఏపీ రైతులకు ప్రభుత్వం పండుగ గిఫ్ట్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.6 వేలు.. విడుదలకు లైన్ క్లియర్..!
Annadata Sukhibhava
Venkatrao Lella
|

Updated on: Oct 18, 2026 | 8:47 PM

Share

ఏపీలోని అన్నదాతలకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో ఒకేసారి రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ కానున్నాయి. దసరా కానుకగా ఈ నిధులు విడుదల చేస్తారని భావించినా.. జాప్యం కారణంగా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అయితే దీపావళికి ముందు ఈ సొమ్ము విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. వరుస పండుగలు రావడంతో రైతుల ఆనందం రెట్టింపు చేసేందుకు త్వరలోనే విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇదేకాక ఎల్‌నివో ప్రభావం వల్ల రైతులు పంటకు దూరం కావడంతో ఆర్ధికంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

ఒకేసారి అకౌంట్లోకి రూ.6 వేలు..

అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4 వేలు ఏపీ ప్రభుత్వం జమ చేయనుండగా.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు జమ చేయనుంది. దీంతో ఏపీ రైతుల అకౌంట్లలో ఒకేసారి రూ.6 వేలు పడనున్నాయి. దీపావళికి ముందే ఇవి ఖచ్చితంగా వస్తాయని తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకంతో కలిసి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.14 వేలు అందిస్తోండగా.. పీఎం కిసాన్ కింద రూ.6 వేలు అందుతాయి. మొత్తం కలిపి ఏడాదిలో ఏపీ రైతులకు రూ.20 వేలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. మూడు విడతలుగా వీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రైతులకు జమ చేస్తున్నారు. జూన్ 20వ తేదీన మునుపటి విడత సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఈ నెల 20తో నాలుగు నెలలు కావొస్తోంది. దీంతో ఏ క్షణమైనా తర్వాతి విడత నిధులు జమ అయ్యే అవకాశముంది.

ఈకేవైసీ తప్పనిసరి

అయితే ఈ నిధులు అందుకోవాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మీ సేవా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఇక ల్యాండ్ రికార్డులు కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తయి ఉండాలి. ఇవన్నీ పూర్తి చేస్తేనే అకౌంట్లోకి నగదు జమ అవుతాయి. లేకపోతే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

Follow Us
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
ఎల్ నినో ఎఫెక్ట్: కరువు కోరల్లో ప్రధాన నగరాలు!
ఎల్ నినో ఎఫెక్ట్: కరువు కోరల్లో ప్రధాన నగరాలు!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు.. ఎప్పుడంటే..
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు.. ఎప్పుడంటే..
మీరు పడుకునే విదానమే మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తుంది.. ఎలా అంటే
మీరు పడుకునే విదానమే మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తుంది.. ఎలా అంటే
ఏడుగురిలో సక్సెస్ ఎవరు, ఫెయిల్యూర్ ఎవరు?
ఏడుగురిలో సక్సెస్ ఎవరు, ఫెయిల్యూర్ ఎవరు?
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దాడి చేసింది ఎవరంటే?
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దాడి చేసింది ఎవరంటే?
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు