AP-E KYC: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ-కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ-కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వినియోగదారులకు ఇబ్బందులు ఉండకుండా మరోసారి గడువు పొడిగించింది ప్రభుత్వం.
కాగా, వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతమున్న రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి. ఇది లేనిది ఎలాంటి పనులు జరగవు. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్ ముఖ్యమే. అందుకే ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అయిపోతుంది. ప్రతిదానికి ఆధార్ అనుసంధానం చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక వేళ ఆధార్ నెంబర్ అనుసంధానం లేకపోతే పనులు జరగవు.