Bankers Meeting: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 215వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. మొత్తం 2.83 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ రంగానికి రూ.1.48 లక్షల కోట్లు, పరిశ్రమలకు రూ.44,500 కోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, సెర్ప్ సీఈవో, పి.రాజాబాబు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ, ఏపీ, కన్వీనర్ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్ కుమార్ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.