ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో మార్పులు సంభవించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. దిగువ ట్రోపో ఆవరణములో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది..
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రండు చోట కురిసే అవకాశంఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..