బిగ్ అలర్ట్.. అల్పపీడనంగా మారనున్న వాయుగుండం..! నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటనచేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటనచేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే.. తీరం వెంబడి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఒడిశా అంతర్గత భాగంలో ఏర్పడిన వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ. వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, ఈరోజు (అక్టోబర్ 3, 2025) ఉదయం 0830 గంటలకు 20.7 ఉత్తర అక్షాంశం – 83.7 తూర్పు రేఖాంశం సమీపంలో అదే ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంది. ఫుల్బానీ (ఒడిశా) కి పశ్చిమ-వాయువ్యంగా దాదాపు 60 కి.మీ., భవానీపట్న (ఒడిశా) కి ఈశాన్యంగా దాదాపు 100 కి.మీ. – సంబల్పూర్ (ఒడిశా) కి నైరుతి దిశలో 90 కి.మీ. దూరంలో ఉంది. ఇది మొదట ఉత్తర-వాయువ్యంగా దిశగా కదిలి అంతర్గత ఒడిశా మీదుగా ఉత్తరం వైపు కదిలి తరువాత ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ, తరువాత 24 గంటల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
ఒడిశా అంతర్గత ప్రాంతాల్లో నున్న వాయుగుండం నుండి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 & 3.1 కి.మీ మధ్య ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్యం – నైరుతి గాలులు వీస్తున్నాయి..
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30- 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30- 40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30- 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
