AP Weather: ఓర్నీ.. ఏపీలో మళ్లీ వానలు.. ఇదిగో ఈ ప్రాంతాల్లో

|

Jul 27, 2024 | 4:30 PM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు 2 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇక వరద కష్టాలతో జనం సతమతమవుతున్నారు. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: ఓర్నీ.. ఏపీలో మళ్లీ వానలు.. ఇదిగో ఈ ప్రాంతాల్లో
Weather
Follow us on

షియర్ జోన్ లేదా గాలుల కొత ఇప్పుడు భారతీయ ప్రాంతంపై సగటు సముద్ర మట్టం నకు 5.8 & 7.6 కి.మీ ఎత్తు మధ్య సుమారుగా 18° ఉత్తర అక్షాంశం వెంబడి వ్యాపించి ,ఎత్తు కు వెళ్లే కొలదీ దక్షిణం వైపు వంగి ఉన్నది.  ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

———————————————-

శనివారం :– తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

——————————–

శనివారం, ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

రాయలసీమ :-

—————-

శనివారం, ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

కాగా నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.