
ఫిబ్రవరి ఇంకా రెండవ వారంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వారం పగటిపూట గరిష్టాలు 37 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రుళ్లు, ఉదయం పరిస్థితి బానే ఉన్నా.. పగలు మాత్రం భానుడు భగ భగ మండిపోతున్నాడు.
దిగువ ట్రోపోఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఫలితంగా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని, రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని అంచనా. వేడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.<
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
సోమవారం, మంగళవారం, బుధవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం, బుధవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రాయలసీమ :-
సోమవారం, మంగళవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
బుధవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.