Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Transfer: ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్.. గత ప్రభుత్వంలో కీలక అధికారులకు నో పోస్టింగ్స్‌

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకున్న అధికారులకు కీలక శాఖల్లో పోస్టింగ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ శాఖలకూ సీనియర్ అధికారులను నియమించింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. ఒకేసారి 19మంది అధికారులకు స్థానచలనం..

IAS Transfer: ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్.. గత ప్రభుత్వంలో కీలక అధికారులకు నో పోస్టింగ్స్‌
Chandrababu
Follow us
pullarao.mandapaka

| Edited By: Subhash Goud

Updated on: Jun 20, 2024 | 10:27 AM

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకున్న అధికారులకు కీలక శాఖల్లో పోస్టింగ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ శాఖలకూ సీనియర్ అధికారులను నియమించింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. ఒకేసారి 19మంది అధికారులకు స్థానచలనం కల్పించింది సర్కార్.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం నిబద్ధతగా పనిచేసే అధికారులకు పెద్దపీట వేసింది. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో అప్పటి పాలకులకు వినయ విధేయతలు ప్రదర్శించిన కొంతమంది అధికారులకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేసింది.

ఈ జాబితాలో సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి,ప్రవీణ్ ప్రకాష్,మురళీధర్ రెడ్డి, రజత్ భార్గవ్ ఉన్నారు. వీరిని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించింది ప్రభుత్వం. గత టిడిపి ప్రభుత్వంలో కూడా ప్రద్యుమ్న సీఎంఓ లో పనిచేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖకు ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌ను నియమించింది. నారా లోకేష్ పరిధిలో ఉన్న పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌ను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరబ్ గౌర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఐదేళ్లపాటు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన కాటమనేని భాస్కర్ ను సి ఆర్ డి ఏ కమిషనర్ గా నియమించింది. అమరావతి నిర్మాణంలో సిఆర్డిఏ పాత్ర చాలా కీలకమైనది. పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ ని నియమించింది.

ఇక గనుల శాఖ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బుడితి రాజశేఖర్ ను నియమించింది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది ని నియమించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి