Social Media Reels: రీల్స్ మోజులో భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య!

నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే.. వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై కూడా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు సోషల్ మీడియ అనేక సమస్యలకూ కారణం అవుతోంది. తాజాగా సోషల్‌ మీడాయాలో లైకులు, వ్యూస్‌ కోసం రీల్స్ చేస్తున్న ఓ భార్య తతంగాన్ని భరించలేక.. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం..

Social Media Reels: రీల్స్ మోజులో భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య!
Husband Committed Suicide In Guntur

Edited By:

Updated on: Oct 20, 2023 | 4:21 PM

తాడికొండ, అక్టోబర్ 20: నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే.. వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై కూడా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు సోషల్ మీడియ అనేక సమస్యలకూ కారణం అవుతోంది. తాజాగా సోషల్‌ మీడాయాలో లైకులు, వ్యూస్‌ కోసం రీల్స్ చేస్తున్న ఓ భార్య తతంగాన్ని భరించలేక.. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కలకు చెందిన తలతోటి వీరయ్యకు, ద్రాక్షావల్లికి పదేళ్ళ క్రితం పెళ్లైంది. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగినా క్రమంగా వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో గత ఏడేళ్లుగా విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ద్రాక్షావల్లి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు పెట్టడంతో పాటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెడుతుంటుంది. ఆమె వీడియోలను అనేక మంది చూస్తుంటారు. ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

అయితే ఆమె చేస్తున్న వీడియోలను స్థానికులు కూడా చూస్తున్నారు. వీరు ద్రాక్షావల్లి గురించి చెడుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. వీరయ్య ద్రాక్షావల్లితో విడిగానే ఉంటున్న నేపధ్యంలో స్థానికులు, స్నేహితులు ఆమె చేస్తున్న వీడియలపై చేసిన కామెంట్స్ వీరయ్య దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కూడా పెరిగింది. ఈక్రమంలోనే వీరయ్య మనస్థాపానికి గురయ్యాడు.

తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అయ్యాడు. ఈ క్రమంలోనే తనువు చాలించాలనుకున్నాడు. ఈ నెల 9వ తేదిన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే వీరయ్యను బంధువులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరయ్య గురువారం (అక్టోబర్‌ 19) మరణించాడు. దీంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడికొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ తో ఒక కటుంబంలో విబేధాలు తలెత్తి చివరకూ భర్త మరణం వరకూ దారి తీయడంపై స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.