YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డి ఆలోచనేంటి?..

|

Mar 18, 2023 | 11:55 AM

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇస్తుందా? విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంపై అవినాష్ రెడ్డి అప్పీల్‌కు వెళ్తారా?

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డి ఆలోచనేంటి?..
Ys Viveka Murder Case
Follow us on

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇస్తుందా? విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంపై అవినాష్ రెడ్డి అప్పీల్‌కు వెళ్తారా? ఈ ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది? వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచనుంది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో పిటిషన్ చేశారు అవినాష్‌రెడ్డి. సీబీఐ విచారణపై స్టే ఇవ్వటంతో పాటు మూడు అంశాలు ప్రస్తావిస్తూ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇందులో రెండింటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ తన విచారణను యధావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

విచారణ జరిపే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న తీరు న్యాయవాదికి కనిపించేలా అనుమతించాలని హైకోర్టు తీర్పు తర్వాత సీబీఐ ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు అవినాష్‌రెడ్డి అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే సీబీఐ విచారిస్తోందని.. ఈ కేసుతో తనకుఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. తనను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని భావిస్తోందన్నది ఆయన వాదన. హైకోర్టు తాజా తీర్పు తర్వాత ఈ కేసులో అటు సీబీఐ, ఇటు అవినాష్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..