AP Weather Alert: రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలాఉంటుందంటే..

AP Weather Alert: అల్పపీడన ద్రోణి బలహీన పడిందని, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి..

AP Weather Alert: రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలాఉంటుందంటే..
Rains
Follow us

|

Updated on: Jul 04, 2021 | 4:58 PM

AP Weather Alert: అల్పపీడన ద్రోణి బలహీన పడిందని, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను అధికారులు ప్రకటించారు. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఇవాళ, రేపు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి(మంగళవారం) ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ ఇంచుమించు ఇదేమాదిరిగా వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం నాడు మాత్రం ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపు వచ్చే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు.

Also read:

Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..

Karivena Satram : శ్రీశైల పుణ్యక్షేత్రంలో కరివేన సత్రానికి వైభవంగా భూమిపూజా కార్యక్రమం

YSRCP: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?