
ఒక ద్రోణి వాయువ్య రాజస్థాన్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ రాయలసీమ పొరుగు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. సిక్కిం నుండి ఉత్తర ఒడిశా వరకు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1, 5.8 కి.మీ మధ్య ఉన్న పశ్చిమ గాలుల ద్రోణి ఈ రోజు బలహీనపడింది. తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ఈ రోజు బలహీనపడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయ..
ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. కోస్తా, యానాంలో రాగాల నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత లు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది. తరువాత రోజుల్లో గణనీయమైన మార్పులేక పోవచ్చు. రాయలసీమలో రాగాల నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది. తరువాత రోజుల్లో గణనీయమైన మార్పు ఉండకపోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.