Andhra Pradesh Weather Forecast: తూర్పు-పశ్చిమ గాలి కోత 19°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 4.5 & 5.8 కి.మీల ఎత్తులో కొనసాగుతున్నది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న 3 రోజులు మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు కూడా ఒకే విధమైన వాతావరణం ఉండనుంది. ఈ రోజు, రేపు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 30-40కి.మీ. వేగంతో 1 లేదా 2చోట్ల వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే ఎల్లుండి ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సమాచారం అందించింది.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..